హైదరాబాద్ 30°C
అమరావతి 34°C
IST 12:08 PM
మంగళవారం ఆగస్టు 18 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

బద్రీనాథ్ ఆలయంలో కానుకల చోరీ ఆరోపణలపై విచారణకు ఆదేశం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
బద్రీనాథ్ ఆలయంలో కానుకల చోరీ ఆరోపణలపై విచారణకు ఆదేశం
📷 Anandhu Arjunan / Pexels
షేర్ కాపీ అయింది ✓

బద్రీనాథ్ ఆలయంలో కానుకల చోరీ జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) స్పందించింది. ఆరోపణలకు తగిన ఆధారాలు లేకపోయినా విచారణ చేపట్టాలని నిర్ణయించింది.

విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఆరోపణల నిజానిజాలు తేల్చాలని ఆదేశించారు. బీకేటీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహన్ సింగ్ రంగర్ తమ పరిధిలోని అన్ని ఆలయాల్లో చందాలు, కానుకల నిర్వహణపై కఠినమైన మార్గదర్శకాలు జారీ చేశారు. నగదు నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అన్ని లెక్కింపు కేంద్రాలు, ట్రెజరీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి కానుకకు ఖచ్చితమైన రికార్డులు నిర్వహించాలని సూచించారు. ఈ ఉత్తర్వులను ఆలయ కమిటీ చైర్మన్లు, ఇంచార్జీలు, అకౌంటెంట్లకు పంపించారు.

ఇటీవల అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో బద్రీనాథ్ ఆలయంలో కానుకల చోరీపై సోషల్ మీడియాలో ప్రచారం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com