హైదరాబాద్ 29°C
అమరావతి 28°C
IST 4:18 PM
శుక్రవారం నవంబర్ 13 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

భీమవరం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల: 52 వార్డులు, ఈ నెల 26న పోలింగ్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
భీమవరం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల: 52 వార్డులు, ఈ నెల 26న పోలింగ్
📷 Ieva Brinkmane / Pexels
షేర్ కాపీ అయింది ✓

భీమవరం మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. చైర్‌పర్సన్‌తో పాటు మొత్తం 52 వార్డు సభ్యుల ఎన్నిక జరగనుంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి మొదలవుతుంది. 14, 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 19వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఫైనల్ జాబితా ప్రకటిస్తారు. ఈ నెల 26న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ నెల 30న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ రఘువీర్ విష్ణు వివరాలను వెల్లడించారు. ఎన్నికల ప్రాంతంలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు పోలీస్ చట్టం సెక్షన్ 30 అమల్లో ఉంటుంది. ఎవరైనా వివాదాలకు లేదా ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పుకార్లను నమ్మి ఎవరూ బయటకు రావద్దని, ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్, రెవెన్యూ శాఖలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు.

చైర్‌పర్సన్ నామినేషన్ల కోసం ఒక గెజిటెడ్ అధికారిని నియమించారు. ప్రతి నాలుగు వార్డులకు ఒక అడిషనల్ ఈఓ, ఒక అసిస్టెంట్ ఈఓ ఉంటారు. వీరే నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నిమిత్తం శిక్షణా తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్‌ను మున్సిపల్ ప్రిమైసెస్‌లోనే ఏర్పాటు చేస్తారు.

దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత భీమవరం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామాల విలీనం సమస్య, కోర్టు వివాదాల కారణంగా గతంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలకు ఏడేళ్లుగా ఎన్నికలు జరగలేదు. జిల్లాలో నాలుగు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవులతో పాటు 188 వార్డులకు ఈ ఎన్నికలు జరుగుతాయి. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. చైర్‌పర్సన్ అభ్యర్థులను రాజకీయ పార్టీలు ఇంకా ప్రకటించలేదు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com