గోదావరి ఒడ్డున క్షుద్ర పూజల ఆనవాళ్లు: భద్రాద్రి జిల్లాలో భయాందోళనలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామంలో గోదావరి నది ఒడ్డున క్షుద్ర పూజల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఒక బొమ్మకు మేకలు గుచ్చి, పసుపు, కుంకుమలతో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ కోళ్లు, ఒక మేకను బలిచ్చినట్లు తెలుస్తోంది.
ఈ దృశ్యాలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎవరు ఈ పూజలు చేశారనేది తెలియక గ్రామంలో టెన్షన్ నెలకొంది. నెల్లిపాక సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పోలీసులు ఇంకా స్పందించాల్సి ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com