హైదరాబాద్ 33°C
అమరావతి 33°C
IST 4:48 PM
సోమవారం అక్టోబర్ 12 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

బోనాల పండుగ జులై 16 నుండి ఆగస్ట్ 13 వరకు: మంత్రి పొన్నం ప్రభాకర్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
బోనాల పండుగ జులై 16 నుండి ఆగస్ట్ 13 వరకు: మంత్రి పొన్నం ప్రభాకర్
📷 112 Uttar Pradesh / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండగ తేదీలను ప్రకటించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ మేరకు తేదీలను వెల్లడించారు. బోనాల పండుగ జులై 16 నుండి ఆగస్ట్ 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ లలో జరగనుంది.

పాత జీహెచ్మసీ పరిధిలోని 3,427 ఆలయాల్లో బోనాల జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్ల 5 లక్షల నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.

బోనాల జాతర జులై 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో ఉత్సవాలతో ప్రారంభం అవుతుంది. ఆగస్ట్ 2న సికింద్రాబాద్ ఉజ్జైని మహంకాళి దేవాలయంలో బోనాలు, రంగం కార్యక్రమం జరుగుతుంది. ఆగస్ట్ 13న హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవం నిర్వహిస్తారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com