మనవరాలితో కారు నడిపించిన SI పై కేసు నమోదు
హైదరాబాద్‌లో ఆరున్నర సంవత్సరాల వయసున్న మనవరాలితో కారు నడిపించిన సబ్ ఇన్స్పెక్టర్ పైన నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ నెల 11వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు గండంగూడా బైరాగిగూడా రోడ్డుపై SI పూజారి తిరుపతి తన చిన్న మనవరాలితో కారు నడిపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు SI పూజారి తిరుపతిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 125తో పాటు మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్లు 184 మరియు 180 కింద కేసు బుక్ చేశారు. వైరల్ వీడియోలో SI తన వద్ద కంట్రోల్ ఉందని, ఆటో గేర్ కావడంతో గేర్ సమస్య లేదని సమర్థించుకున్నారు. అయితే సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తులు రోడ్డు సొంతం కాదని, వేల మంది ప్రాణాలు ఉంటాయని హెచ్చరించారు. చిన్న పిల్లకు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని నిలదీశారు. ఒక పోలీస్ అధికారి అలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తప్పు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com