జాతీయం

మెటాకు కేంద్రం నోటీసులు: చిన్నారుల లైంగిక వేదింపుల ప్రకటనల నిలిపివేత ఆదేశం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
మెటాకు కేంద్రం నోటీసులు: చిన్నారుల లైంగిక వేదింపుల ప్రకటనల నిలిపివేత ఆదేశం
📷 Rahul Sapra / Pexels
షేర్ కాపీ అయింది ✓

కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మెటా సంస్థకు నోటీసులు జారీ చేసింది. మెటా ప్లాట్‌ఫామ్‌లపై చిన్నారుల లైంగిక వేదింపులను ప్రోత్సహించే పెయిడ్ యాడ్స్‌, కంటెంట్‌ వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించినట్టు తెలిపింది.

అలాంటి అన్ని ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని, సంబంధిత కంటెంట్‌ను తొలగించాలని కేంద్రం ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఏడు రోజుల్లోపు సమర్పించాలని మెటాను కోరింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com