జాతీయం బ్రేకింగ్

చిన్నారుల భద్రత: ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్‌పై మెటాకు కేంద్రం నోటీసులు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
చిన్నారుల భద్రత: ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్‌పై మెటాకు కేంద్రం నోటీసులు
📷 Ryan Thomas / Pexels
షేర్ కాపీ అయింది ✓

చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించే విధంగా ఉన్న ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మెటా సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన కొన్ని పెయిడ్ యాడ్స్ చిన్నారులపై లైంగిక దోపిడీకి దారితీసే విధంగా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత కంటెంట్, ప్రకటనల ఆమోద ప్రక్రియలో ఎక్కడ లోపాలు జరిగాయనే విషయంపై వారం రోజుల్లో సమగ్ర వివరణ ఇవ్వాలని కేంద్రం కోరింది. గడువులోపు సమాధానం ఇవ్వకపోతే, నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రకటనల పరిశీలన, ఆమోదంలో లొసుగులు ఎలా వచ్చాయో వివరించాలని కూడా నోటీసులో పేర్కొంది.

ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత మెటా ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుందో, భవిష్యత్తులో చిన్నారులకు హాని కలిగించే కంటెంట్‌ను గుర్తించి తొలగించడానికి ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయో తెలియజేయాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేకాక, మెటా రికమెండేషన్ algorithm చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలను ప్రోత్సహించిందన్న ఆరోపణలను కూడా ప్రస్తావించింది.

చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నోటీసు ద్వారా సోషల్ మీడియా కంపెనీల బాధ్యతను మరోసారి గుర్తు చేసింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com