హైదరాబాద్ 27°C
అమరావతి 31°C
IST 8:28 AM
శుక్రవారం జూలై 10 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వ్యాపారం

క్రెడిట్ కార్డు వినియోగంపై కీలక సూచనలు: ఏ ఖర్చులకు వాడాలి, ఏ ఖర్చులకు వాడొద్దు?

రచన: ఉషా కిరణం డెస్క్ ·
క్రెడిట్ కార్డు వినియోగంపై కీలక సూచనలు: ఏ ఖర్చులకు వాడాలి, ఏ ఖర్చులకు వాడొద్దు?
📷 Fahad Puthawala / Pexels
షేర్ కాపీ అయింది ✓

క్రెడిట్ కార్డు వినియోగదారులు తరచూ చేసే కొన్ని పొరపాట్లు భారీ ఛార్జీలకు దారితీస్తాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తే ఆ రోజు నుంచే వడ్డీ లెక్కిస్తారు. నెలకు 2.5 నుంచి 3.99% వరకు వడ్డీ పడొచ్చు. అదనంగా 2.5-3% క్యాష్ అడ్వాన్స్ చార్జ్ లేదా కనీసం ₹300-500 వసూలు చేస్తారు. వీటిపై GST కూడా చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల ఏటీఎం కోసం క్రెడిట్ కార్డు వాడకూడదు.

కిరాణా, రెస్టారెంట్లు, ఇతర సాధారణ పేమెంట్లకు క్రెడిట్ కార్డు వాడితే తెలియకుండానే ఖర్చు పెరిగే ప్రమాదం ఉంది. నెలవారీ బడ్జెట్ నియంత్రణ కోసం క్యాష్ లేదా డెబిట్ కార్డు వాడటం మంచిది.

విదేశాల్లో ప్రతి ఖర్చుకు క్రెడిట్ కార్డు వాడటం సురక్షితం కాదు. అంతర్జాతీయ లావాదేవీల్లో ఫారెక్స్ మార్కప్ చార్జీలు 2 నుంచి 3.5% వరకు ఉంటాయి. దీనికి బదులు ప్రీపెయిడ్ కరెన్సీ కార్డ్ లేదా స్థానిక కరెన్సీలో చెల్లించడం ఉత్తమం.

క్రెడిట్ కార్డు బిల్లును పూర్తిగా చెల్లించే వ్యక్తులకు 20-50 రోజుల వడ్డీ రహిత కాలం ఉంటుంది. ఒకవేళ పూర్తిగా చెల్లించకపోతే లేట్ ఫీజుతో పాటు నెలకు 2.5-3.99% వడ్డీ వసూలవుతుంది. కొన్ని సందర్భాల్లో లావాదేవీ తేదీ నుంచే వడ్డీ లెక్కిస్తారు. కాబట్టి సమయానికి రీపేమెంట్ చేయగలమని నమ్మకం ఉంటేనే క్రెడిట్ కార్డు వాడాలి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com