హైదరాబాద్ 32°C
అమరావతి 34°C
IST 4:34 PM
మంగళవారం సెప్టెంబర్ 8 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

కరీంనగర్‌లో చెరువు కట్ట అలైన్మెంట్ పరిశీలన

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కరీంనగర్‌లో చెరువు కట్ట అలైన్మెంట్ పరిశీలన
📷 Hrishav Jha / Pexels
షేర్ కాపీ అయింది ✓

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో చెరువు కట్ట అలైన్మెంట్ పనులను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బండి రాజేశ్వరి పరిశీలించారు.

చెరువు కట్ట నిర్మాణం వల్ల ముంపు ప్రభావానికి గురయ్యే ఇళ్లను సందర్శించి స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను సేకరించారు.

గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ సందర్భంగా బండి రాజేశ్వరి ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అధికారులకు సహకరించాలని సూచించారు. వారి అభ్యంతరాలను కలెక్టర్‌కు తెలియజేస్తామని చెప్పారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com