గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ గడువు ఆగస్ట్ 16, 2026 వరకు పొడిగింపు
దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ వినియోగదారులు తమ కనెక్షన్‌లకు ఈకేవైసి చేయించుకోవడం తప్పనిసరి.
ఇప్పటికే గడువు జూలై 31, 2026గా నిర్ణయించగా, పూర్తి చేయని వినియోగదారులకు మరో అవకాశంగా ఆగస్టు 16, 2026 వరకు గడువు పొడిగించారు. ఈ గడువు లోపు ఈకేవైసి పూర్తి చేయకపోతే తదుపరి సిలిండర్ పొందడంలో ఇబ్బంది ఎదురవుతుంది.
అంతేకాక, పీఎం ఉజ్వల యోజన సబ్సిడీ కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే గడువు లోపే ఈకేవైసి తప్పక చేయించుకోవాలి.
ఈకేవైసి చేయించుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి: సంబంధిత గ్యాస్ కంపెనీ యాప్ ద్వారా, డెలివరీ బాయ్ ఇంటికి వచ్చినప్పుడు అతని ద్వారా, లేదా దగ్గరలోని గ్యాస్ కంపెనీ కార్యాలయానికి వెళ్లి చేయించుకోవచ్చు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com