SIR 2026 ప్రక్రియలో మీ వివరాలను ఎలా ధృవీకరించుకోవాలి
SIR 2026 ప్రక్రియలో BLO వివరాలు తెలుసుకోవడానికి CEO వెబ్‌సైట్‌లో పోలింగ్ స్టేషన్ వారీగా సమాచారం అందుబాటులో పెట్టడం జరిగింది. అలాగే Voter Helpline యాప్‌లో EPIC నెంబర్ ఎంటర్ చేస్తే BLO పేరు, ఫోన్ నెంబర్, Electoral Registration Officer వివరాలు, జిల్లా ఎన్నికల అధికారి వివరాలు అన్నీ వెంటనే కనిపిస్తాయి.
నిరక్షరాస్యులు BLO ని నేరుగా సంప్రదించి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు అందజేయవచ్చు. ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత పబ్లిక్ ప్రదేశాలలో జాబితా చూసుకోవచ్చు. అర్హత తేదీ 1 అక్టోబర్ 2026 నాటికి 18 సంవత్సరాలు నిండినవారు Form 6 నింపి Declaration Form తో సహా BLO కి ఇవ్వవచ్చు.
ఎన్యుమరేషన్ ఫారంలో ఐదు భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో EPIC నెంబర్, చిరునామా వంటి వివరాలు ముందే నమోదై వస్తాయి. రెండవ భాగంలో 2002 ఓటర్ జాబితా వివరాలు అడుగుతారు. మూడవ భాగంలో మొబైల్ నెంబర్, Aadhaar నెంబర్, తల్లిదండ్రుల వివరాలు ఉంటాయి. నాలుగవ భాగంలో డిక్లరేషన్ ఉంటుంది. ఐదవ భాగంలో BLO ధృవీకరణ జరుగుతుంది.
2002 జాబితా వివరాలు అందించలేకపోయినా ఓటు తొలగించబడదు అనేది స్పష్టంగా తెలుపబడింది. ఇది కేవలం అపోహ మాత్రమే. చనిపోయిన వారి పేర్లు, శాశ్వతంగా వలస వెళ్ళిన వారి పేర్లు తొలగించడమే ఈ ప్రక్రియ ముఖ్య లక్ష్యం.
ఒకవేళ తుది జాబితాలో పేరు తొలగిపోయిందని అభ్యంతరం ఉంటే ఆదేశాలు జారీ అయిన తేదీ నుండి 15 రోజులలోగా జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు. ఆ నిర్ణయం నచ్చకపోతే 30 రోజులలోగా CEO కి సెకండ్ అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో నేరుగా కార్యాలయానికి వెళ్ళి కానీ సమర్పించవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ 1950 కూడా అందుబాటులో ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com