తెలంగాణ

హైదరాబాద్‌లో H-FAST 100 రోజుల్లో 185 ఆహార కల్తీ కేసులు నమోదు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
హైదరాబాద్‌లో H-FAST 100 రోజుల్లో 185 ఆహార కల్తీ కేసులు నమోదు
📷 prasun_16 . / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్‌లో ఆహార కల్తీ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) విభాగం 100 రోజుల్లో 185 కేసులు నమోదు చేసింది.

122 టన్నుల కల్తి, నాసిరకం ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది.

డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో నిత్యం సోదాలు నిర్వహిస్తోంది. స్వాధీనం చేసుకున్న వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్, కోవా, నెయ్యి, మాంసం, చికెన్, పండ్లు తదితరాలు ఉన్నాయి.

247 కేసుల దర్యాప్తును ఫుడ్ సేఫ్టీ అధికారులకు బదిలీ చేశారు. రాజేంద్ర జోన్‌లో అత్యధికంగా 55 కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు సగటున 16 ఫిర్యాదులు వస్తున్నాయి.

కల్తి ఆహారంతో ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు.

ఫిర్యాదుల కోసం డయల్ 100 లేదా H-FAST నంబర్‌ను సంప్రదించవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి మరిన్ని దాడులు నిర్వహిస్తామని చెప్పారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com