హైదరాబాద్ 32°C
అమరావతి 33°C
IST 12:25 PM
గురువారం జూలై 16 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

సైదాబాద్ సక్సెస్ స్కూల్లో హిందూ విద్యార్థులకు ఖురాన్ పాఠాలు: తల్లిదండ్రుల నిరసన

రచన: ఉషా కిరణం డెస్క్ ·
సైదాబాద్ సక్సెస్ స్కూల్లో హిందూ విద్యార్థులకు ఖురాన్ పాఠాలు: తల్లిదండ్రుల నిరసన
📷 Andy Barbour / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్ సైదాబాద్ లోని సక్సెస్ స్కూల్ లో రెండో తరగతి హిందూ విద్యార్థికి ఇస్లామిక్ ప్రార్థనలు (కల్మా, సురా ఫతేహ) హోంవర్క్ గా ఇవ్వడం వివాదాస్పదమైంది. తల్లిదండ్రులు ఈ విషయంపై స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు.

స్కూల్ డైరీలో “సురా ఫతేహ, కల్మా చదవాలి” అని టీచర్ రాసిన గమనికను చూసిన పేరెంట్స్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. బాలుడి తల్లితండ్రులు హిందువులు కావడంతో, మత విశ్వాసాలకు విరుద్ధంగా ఇలాంటి హోంవర్క్ ఇవ్వడాన్ని వారు సహించలేదు.

స్కూల్ ప్రిన్సిపాల్ వివరణ ఇస్తూ, ఇది మతపరమైన సాధన అని, స్కూల్లో చదివే ప్రతి విద్యార్థికీ తప్పనిసరి అని చెప్పారు. ఈ సమాధానంతో పేరెంట్స్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. “మా పిల్లలకు వారి మతానికి భిన్నమైన ప్రార్థనలు బలవంతంగా చేయించడం మానసికంగా ఒత్తిడి కలిగిస్తోంది. ఇది బ్రెయిన్ వాష్ లాంటిది” అని తల్లిదండ్రులు వాపోయారు. ఇంతకుముందు కూడా ఇలాంటి హోంవర్క్ ఇచ్చిన దాఖలాలు డైరీలో స్ట్రైక్ ఆఫ్ చేసి ఉన్నాయని వారు చూపించారు.

ఈ ఘటనపై హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. బీజేపీ నేత రాజాసింగ్ మాట్లాడుతూ “హిందూ విద్యార్థులపై బలవంతంగా ఖురాన్ రుద్దుతున్నారు” అని విమర్శించారు. స్కూల్ పై తక్షణమే పోలీసులు కేసు నమోదు చేయాలని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com