హైదరాబాద్ 31°C
అమరావతి 35°C
IST 10:57 AM
సోమవారం జూలై 13 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

హైదరాబాద్‌లో పిచ్చుకల సంఖ్య 20,000కు చేరింది: స్వచ్ఛంద సంస్థ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
హైదరాబాద్‌లో పిచ్చుకల సంఖ్య 20,000కు చేరింది: స్వచ్ఛంద సంస్థ
📷 prasun_16 . / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్ నగరంలో పిచ్చుకల సంఖ్య 20,000 నుంచి 25,000 మధ్య ఉన్నట్టు ‘Bring Back Sparrow’ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.

సంస్థ నిర్వాహకుడు ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం, నగరంలో ఏర్పాటు చేసిన 7,000 చెక్క గూళ్ల ద్వారా ఈ పెరుగుదల సాధ్యమైంది. సిటిజన్ సైన్స్ విధానంలో డేటా సేకరించి ఈ లెక్క తేల్చినట్టు చెప్పారు.

ఇళ్ల పైన, బాల్కనీల్లో గార్డెన్స్ లో ఈ చెక్క బాక్సులను ఉంచడంతో పిచ్చుకలు తిరిగి వచ్చాయని వివరించారు. ఈ ప్రయత్నం ద్వారా పిచ్చుకలకు ఆవాసం, ఆహారం లభించడంతోపాటు పర్యావరణానికి మేలు జరిగిందన్నారు.

గతంలో పట్టణ అభివృద్ధి కారణంగా పిచ్చుకలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో ఈ పెరుగుదల శుభ పరిణామం.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com