తెలంగాణలో మోస్తరు వర్షాలు: పలు జిల్లాలకు IMD యెల్లో అలర్ట్
వాయువ్య బంగాళ ఖాతంలో ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు కూడా రెయిన్ అలర్ట్ ఇచ్చింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచొచ్చని IMD అధికారులు హెచ్చరించారు. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com