రైళ్లలో స్క్రీన్‌షాట్, ఫార్వర్డ్ టికెట్లు ఇకపై చెల్లవు: రైల్వే శాఖ
ఇండియన్ రైల్వేస్ ట్రైన్ టికెట్ల విషయంలో కొత్త నియమాలు ప్రకటించింది. ఇకపై WhatsApp లో ఫార్వర్డ్ చేసిన టికెట్లు, స్క్రీన్ షాట్ టికెట్లు రైళ్లలో చెల్లవు.
IRCTC ప్లాట్ఫామ్ నుంచి నేరుగా కొనుగోలు చేసిన ఒరిజినల్ ఈ-టికెట్ లేదా ప్రింటెడ్ టికెట్ మాత్రమే అనుమతించబడుతుంది. స్క్రీన్ షాట్ లేదా ఫార్వర్డ్ టికెట్లను ఎడిట్ చేసే, టాంపరింగ్ చేసే అవకాశం ఉందని, ఒకే టికెట్ పలువురు వినియోగించడం జరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు.
టికెట్ తనిఖీ సమయంలో ప్రయాణికులు IRCTC యాప్‌లో కనిపించే ఒరిజినల్ టికెట్, టికెట్ బుకింగ్ తర్వాత వచ్చిన కన్ఫర్మేషన్ మెసేజ్, అవసరమైతే ప్రింటెడ్ కాపీ, మరియు ఆధార్, పాన్ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
స్క్రీన్ షాట్ లేదా ఫార్వర్డ్ టికెట్ చూపిస్తే, ప్రయాణికుడు కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దానితో పాటు జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని రైల్వే శాఖ హెచ్చరించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com