తత్కాల్ టికెట్ బుకింగ్ ఇబ్బందులను తగ్గించేందుకు కొత్త వెబ్‌సైట్ రూపొందిస్తున్న ఇండియన్ రైల్వేస్
ఇండియన్ రైల్వేస్ తత్కాల్ టికెట్ బుకింగ్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు కొత్త వెబ్‌సైట్ రూపొందిస్తోంది.
ప్రస్తుతం ఉన్న IRCTC సైట్‌లో తత్కాల్ సమయంలో ఒకేసారి లక్షల మంది ప్రయత్నించడం వల్ల సైట్ క్రాష్ కావడం, పేమెంట్ ఇబ్బందులు, క్యాప్చా పునరావృతం వంటి సమస్యలు చాలా మందికి ఎదురవుతున్నాయి.
కొత్త వెబ్‌సైట్‌ను 1.50 లక్షల మంది ఏకకాలంలో టికెట్ బుకింగ్ చేసినా సైట్ క్రాష్ కాకుండా, సెక్యూరిటీ ఇబ్బందులేవీ లేకుండా డిజైన్ చేస్తున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.
దీనికి కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటుందని, క్యాప్చా సమస్య తగ్గించనున్నట్టు కూడా చెప్తున్నారు. ఈ వెబ్‌సైట్‌ను ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి ముందు లాంచ్ చేయాలన్నది ఇండియన్ రైల్వే లక్ష్యంగా ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com