హైదరాబాద్ 26°C
అమరావతి 32°C
IST 8:33 AM
బుధవారం జూలై 8 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
విద్య

వరి పంటలో పురుగుల నివారణకు శాస్త్రవేత్త కామాక్షి సూచనలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వరి పంటలో పురుగుల నివారణకు శాస్త్రవేత్త కామాక్షి సూచనలు
📷 EqualStock IN / Pexels
షేర్ కాపీ అయింది ✓

వానాకాలం వరి సాగుకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో, పంటను ఆశించే పురుగుల నివారణపై బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త కామాక్షి సూచనలు చేశారు. వరిలో కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగు, ఉల్లికోడు, దోమ వంటి పురుగులు సాధారణంగా ఆశిస్తాయని, సకాలంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు.

నారుమడి దశ నుంచే చీడపీడల నివారణ చర్యలు చేపట్టాలని, విత్తన శుద్ధి తప్పనిసరి అని సూచించారు. కార్బండిజం 3 గ్రాములు, తయోమెతాక్సం 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలి. నారుమడిలో నాటు పెట్టిన 10 రోజులకు లేదా నారు పీకడానికి 10 రోజుల ముందు కార్బోఫిరాన్ గుళికలు వేయడం వల్ల ప్రధాన పొలంలో కాండం తొలుచు పురుగు, ఉల్లికోడులను కొంతవరకు నియంత్రించవచ్చన్నారు.

పైరు పిలక దశలో జీవ నియంత్రణగా ట్రైకోగ్రామా కార్డులను ఎకరాకు రెండు నుంచి మూడు చొప్పున వేసుకోవాలి. వేపగింజల కషాయం (5%) లేదా వేపనూనె పిచికారీ చేస్తే దోమ, ఆకుముడత పురుగుల గుడ్లు నశిస్తాయి. రసాయన పద్ధతిగా, కాటాప్ హైడ్రోక్లోరైడ్, ఫ్లూబెండమైడ్ లేదా క్లోరాంటినిలిప్రోల్ మందులు ఏదో ఒకటి పురుగుల ఉదృతిని బట్టి పిచికారీ చేసుకోవాలి.

దోమ ఉదృతి 10-15 కన్నా ఎక్కువ ఉంటే అసఫేట్, పైమైట్రోజైన్ లేదా డైనోటెఫరాన్ లాంటి సిస్టమిక్ ఇంసెక్టిసైడ్లను మార్చి మార్చి పిచికారీ చేయాలి. ఉల్లికోడు కోసం కార్బోఫిరాన్ 10 కిలోలు ఎకరానికి గుళికలుగా వేయడం లేదా ఫిప్రోనిల్ 400 మి.లీ. స్ప్రే చేసుకోవడం మంచిది. నల్లి పురుగు పొట్టదశలోనే ఆశించడం వల్ల, ప్రొఫెనోఫాస్ లేదా స్పైరోమెసిఫెన్ డైకోఫాల్ తో పాటు ట్రోపికొనజోల్ కలిపి పిచికారీ చేస్తే నల్లి మరియు కంకి తెగుళ్లు నివారించవచ్చని కామాక్షి వివరించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com