హైదరాబాద్ 27°C
అమరావతి 32°C
IST 7:42 PM
మంగళవారం జూలై 7 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

జులై 13న కాటేదాన్ అయ్యప్పస్వామి దేవాలయంలో 1111 శివలింగ అభిషేకం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
జులై 13న కాటేదాన్ అయ్యప్పస్వామి దేవాలయంలో 1111 శివలింగ అభిషేకం
📷 Freddy / Pexels
షేర్ కాపీ అయింది ✓

జులై 13న అర్ధాహోరాత్ర మహా మాస శివరాత్రి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌ సమీపంలోని కాటేదాన్‌ గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

దేవాలయం ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ రోజున ఆరుద్రా నక్షత్రం, సోమవారం కలయికతో అద్వితీయ యోగం ఏర్పడుతోంది. ఈ సందర్భంగా 1111 శివలింగాలతో కైలాస యంత్రాన్ని స్థాపించి ఉదయం నుంచి రాత్రి వరకు 12 గంటలపాటు ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. సంధ్యా సమయంలో లక్ష వత్తులతో లక్ష దీపార్చన, అగ్నిహోత్రం నిర్వహిస్తారు.

భక్తులు తమ గోత్ర నామాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ క్రతువులో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవచ్చని దేవాలయం తెలిపింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com