KBR పార్క్ చుట్టూ 18 నుంచి వన్-వే ట్రాఫిక్ అమలు
హైదరాబాద్ KBR పార్క్ చుట్టూ 18వ తేదీ నుంచి వన్-వే ట్రాఫిక్ అమలు కానుంది. నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ ఆంక్షలు సుమారు ఏడాదిన్నర పాటు కొనసాగుతాయి.
KBR జంక్షన్ నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్ వైపు నేరుగా వెళ్లే అవకాశం ఉండదు. వాహనదారులు ఫ్రీ లెఫ్ట్ తీసుకుని క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా వెళ్లాలి. తర్వాత అగ్రసేన్ ఐలాండ్, అపోలో జంక్షన్, జర్నలిస్ట్ కాలనీ మీదుగా రోడ్ నంబర్ 45 చేరుకోవాలి. అక్కడి నుంచి చెక్‌పోస్ట్ వెళ్లవచ్చు.
చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వెళ్లే వారికి ఎలాంటి సమస్య ఉండదు. సాగర్ సొసైటీ మీదుగా నేరుగా వెళ్లవచ్చు. మాదాపూర్ వెళ్లాలంటే చెక్‌పోస్ట్ వద్ద లెఫ్ట్ తీసుకుని అల్కజర్ షోరూం మీదుగా వెళ్లాలి.
KBR పార్క్ చుట్టూ 13 exits ఉంటాయి. వాహనదారులు ప్రతి పాయింట్ వద్ద ఫ్రీ లెఫ్ట్ తీసుకోవాలి. పోలీసులు ప్రత్యేక మ్యాప్, సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. రాంగ్ సైడ్ వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com