కొడిని గ్రామంలో 400 జంటల కవలలు — కారణం మాత్రం మిస్టరీ
కేరళలోని మలపురం జిల్లా కొడిని గ్రామం ‘కవలల గ్రామం’గా ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ కేవలం 2,000 కుటుంబాలు మాత్రమే నివసించినా 400 జంటలకు పైగా కవలలు ఉన్నారు.
పాఠశాల రిజిస్టర్లలో ఒకేలా ఉండే విద్యార్థులు డజన్ల కొద్దీ కనిపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1,000 ప్రసవాల్లో నాలుగు కవల జంటలు జన్మిస్తుండగా, కొడినిలో ఈ సంఖ్య 45 దాటుతోంది.
2016లో హైదరాబాద్‌కు చెందిన CSIR-CCMB శాస్త్రవేత్తలు, కింగ్స్ కాలేజ్ లండన్, జర్మనీ, నైజీరియా పరిశోధకులు ప్రజల లాలాజలం, DNA నమూనాలు సేకరించి అధ్యయనం చేశారు.
నైజీరియాలోని ఇగ్బోరా, బ్రెజిల్‌లోని కాండిడో గాడోయి గ్రామాల్లోనూ ఇలాంటి వింత కనిపిస్తుంది. నైజీరియాలో కొన్ని దుంపల ఆహారం వల్ల కవలలు ఎక్కువగా పుడుతున్నారని అంచనా ఉన్నా, కొడిని ప్రజల ఆహార అలవాట్లు ఇతర కేరళీయుల మాదిరిగా సాధారణంగానే ఉన్నాయి.
ఈ చిన్న గ్రామంలో ఇంత భారీ స్థాయిలో కవలలు జన్మించడానికి కారణం ఇప్పటికీ తెలియలేదు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com