దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహా సంప్రోక్షణ
కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 26న మహా సంప్రోక్షణ మహోత్సవం జరిగింది. వేద పండితులు జీర్ణోద్ధరణ సహిత అష్టబంధన మహా కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
చతుస్థానార్చన, మూర్తి హోమం, ప్రాయశ్చిత్త హోమం నిర్వహించారు. ఉదయం 9:45 నుంచి 11:30 వరకు శ్రవణ నక్షత్రం, తులా లగ్నంలో మహా పూర్ణాహుతి, మహా సంప్రోక్షణ కళాకర్షణ కార్యక్రమాలు జరిగాయి. ఆలయానికి పూర్వ వైభవం, పవిత్రత చేకూరాలని ప్రత్యేక పూజలు చేశారు.
కార్యక్రమం ముగిసిన అనంతరం భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు. TTD EO ముద్దాడ రవిచంద్ర, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com