హైదరాబాద్ 31°C
అమరావతి 32°C
IST 3:15 PM
ఆదివారం జూలై 19 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
నేరాలు

నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ చోరుడు భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు అరెస్ట్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ చోరుడు భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు అరెస్ట్
📷 Baljit Johal / Pexels
షేర్ కాపీ అయింది ✓

నల్లగొండ జిల్లా పోలీసులు మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర చోరుడు భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజును అరెస్ట్ చేశారు. అతను 9 మంది సభ్యులతో ముఠా ఏర్పాటు చేసి, యువకులకు చోరీల్లో శిక్షణ ఇచ్చి పలు జిల్లాల్లో దొంగతనాలు చేయించాడని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. డబ్బు అవసరమున్న యువకులను లక్ష్యంగా చేసుకొని ప్రలోభపెట్టి నేరాల్లోకి దింపేవాడు.

గత వారం మూడు ప్రత్యేక బృందాలతో గాలించి భూష్మి శ్రీకాంత్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో కాల్పులు కూడా జరిగాయి. అతన్ని మిర్యాలగూడా రూరల్ పోలీస్‌స్టేషన్ కేసు (క్రైమ్ నెం.257/24)లో రిమాండ్‌కు పంపించి, పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించగా మరో 8 మంది సభ్యులను గుర్తించారు. వారిలో తుమ్మిశెట్టి నాగరాజు, సాయి కిరణ్, అశోక్, కోటేశ్వరరావు, నాగకిరణ్, పిల్లి రాజేష్ అనే ఆరుగురిని అరెస్టు చేశారు. వీరంతా ఆంధ్రప్రదేశ్, పొరుగు రాష్ట్రాలకు చెందినవారు.

నిందితుల కబులిస్తే మొత్తం 40 చోరీ కేసులు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. ఇందులో 28 కేసులు నల్గొండ జిల్లాలో, 12 కేసులు ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో నమోదైనట్లు వెల్లడించారు. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా 260 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి, 50,000 నగదు, టీవీ, సౌండ్ బార్లు, 5 బైక్‌లు, 7 మొబైల్ ఫోన్లు సహా 53 లక్షల రూపాయల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. భూష్మి శ్రీకాంత్ తన ముఠా సభ్యులకు తాళాలు బ్రేక్ చేయడం, పోలీసుల నుంచి తప్పించుకోవడంపై శిక్షణ ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com