NITHM హైదరాబాద్‌లో ట్రాన్స్జెండర్ మహిళలకు 10 రోజుల చెఫ్ శిక్షణ
హైదరాబాద్‌లోని NITHM కాలేజీలో 25 మంది ట్రాన్స్జెండర్ మహిళలకు 10 రోజుల ప్రత్యేక క్యూలినరీ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో ఇండియన్, చైనీస్, కాంటినెంటల్ వంటకాలు, హోటల్ రంగంలో అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలు నేర్పుతున్నారు.
ఉపాధి అవకాశాలు లేని ట్రాన్స్జెండర్ మహిళలు ఈ శిక్షణతో స్వయం ఉపాధి దిశగా ముందుకు వెళ్తున్నారు. ఒక శిక్షణార్థి మాట్లాడుతూ, “మాకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇలాంటి శిక్షణ ఇస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు ఈ పథకాలు తీసుకొచ్చారు” అని తెలిపారు. గతంలో వీరు చిన్నచూపు, వివక్ష ఎదుర్కొన్నామని, ఇప్పుడు గౌరవంగా జీవించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
చాలామంది ఫుడ్ స్టాల్స్, క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. ప్రభుత్వ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని వారు స్వాగతించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com