కావ్య - అనిరుధ్ పెళ్లి వేడుకకు టాలీవుడ్ నుండి అల్లు అర్జున్‌కు మాత్రమే పిలుపు!
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ త్వరలోనే పెళ్లి పీట లెక్కనున్నారు. SRH కో ఓనర్ కావ్య మారన్‌ను ఆయన వివాహం చేసుకోనున్నారు. వచ్చే నెల 10, 11 తేదీలలో వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరగనున్నట్టు తెలుస్తుంది. గ్రీస్ వేదికగా జరిగే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయని సమాచారం.
ఈ పెళ్లి వేడుకలో కేవలం ఇరు కుటుంబాలతో పాటు కావ్య, అనిరుద్ధుల అత్యంత దగ్గరి స్నేహితులు మాత్రమే పాల్గొనున్నారట. సినీ, రాజకీయ ప్రముఖుల కోసం నవంబర్ 21న వెడ్డింగ్ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. చెన్నైలోని ITC గ్రాండ్‌లో జరిగే ఈ వేడుకకు PM నరేంద్ర మోడీ, తమిళనాడు CM జోసెఫ్ విజయ్‌తో సహా పలువురు ప్రముఖులు హాజర్ కానున్నట్టు తెలుస్తుంది.
కోలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఈ గ్రాండ్ రిసెప్షన్‌కు హాజర్ కానున్నారు. అనిరుద్ మామ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహ్మాన్, కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ మరియు అతని భార్య ఆర్తి, అజిత్ కుమార్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తదితరులు ఈ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఆహ్వానితలలో ఉన్నట్లు సమాచారం.
టాలీవుడ్ నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే ఈ అతిథుల జాబితాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అనిరుద్ రవిచందర్, కావ్య మారన్‌ల గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించి ఆహ్వానాలు కూడా సిద్ధమయ్యాయి. ఈ ఇన్విటేషన్ బాక్స్ ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఐవరీ రంగు బాక్స్‌పై లేత నీలి రంగు ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన ఈ ఇన్విటేషన్ బాక్స్ చాలా అద్భుతంగా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. బాక్స్‌పై ఎంబోస్డ్ అక్షరాలు మరియు వింటేజ్ లుక్స్ ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ బాక్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అభిమానులు పేర్కొంటున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com