హైదరాబాద్ 27°C
అమరావతి 33°C
IST 9:50 AM
గురువారం జూలై 9 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
అంతర్జాతీయం

ప్రధాని మోదీ మెల్బోర్న్ చేరుకున్నారు; ప్రవాస భారతీయుల స్వాగతం, వందేమాతరం నినాదాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ప్రధాని మోదీ మెల్బోర్న్ చేరుకున్నారు; ప్రవాస భారతీయుల స్వాగతం, వందేమాతరం నినాదాలు
📷 Narendra Modi / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ చేరుకున్నారు.

విమానాశ్రయంలో అధికారిక స్వాగతం అనంతరం అక్కడి భారత సంతతి ప్రజలు, ప్రవాస భారతీయులు ఆయనకు సాంస్కృతిక ప్రదర్శనలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వందేమాతరం, భారత్ మాతాకి జై నినాదాలు చేశారు. ఆస్ట్రేలియన్ ఇండియన్ ఆర్కెస్ట్రా వందేమాతరం ఆలపించింది.

ఈ పర్యటనలో భాగంగా మోదీ ఆస్ట్రేలియా ప్రధాని యాంతోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలు చర్చించనున్నారు.

భారత్-ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గతంలో 14 బిలియన్ డాలర్లు ఉంటే ప్రస్తుతం 55 బిలియన్ డాలర్లకు చేరింది. 2030 నాటికి దీనిని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మోదీ ఈ పర్యటన తర్వాత న్యూజిలాండ్ వెళ్తారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com