కల్కి 2 హీరోయిన్ గురించి ప్రభాస్ రహస్య Instagram హింట్ వైరల్!
ప్రభాస్ తన సొంత సినిమాల కంటే ఇతర సినిమాల ప్రమోషన్స్ ఎక్కువగా చేస్తుంటారు. కానీ ఈసారి ఆయన చేసిన ప్రమోషన్ కొత్త చర్చకు తెరతీసింది. యష్రాజ్ ఫిలిమ్స్ స్పై త్రిల్లర్ ఆల్ఫా చిత్రాన్ని ప్రభాస్ తన Instagram లో ప్రమోట్ చేశారు. ట్రైలర్ అమేజింగ్ గా ఉందని పొగిడుతూ అలియా భట్ కు, నిర్మాణ సంస్థకు ఆల్ ది బెస్ట్ చెప్పి YouTube లింక్ కూడా షేర్ చేశారు. దీనికి అలియా భట్ థాంక్యూ సో మచ్ అంటూ రిప్లై ఇచ్చింది. ఈ సంభాషణ ఇప్పుడు కొత్త రూమర్స్ కు దారితీసింది. కల్కి 2 లో అలియా భట్ కన్ఫర్మ్ అయిందని ప్రభాస్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. గతంలో ఇలాంటి వార్తలను కల్కి టీం ఖండించినప్పటికీ గాసిప్స్ ఆగడం లేదు. దీపిక పదుకొనే స్థానంలో కాకుండా ఓ స్పెషల్ రోల్ లో అలియా నటించబోతోందని TFI లో టాక్ వినిపిస్తోంది. ఆమెపై కొంత షూటింగ్ కూడా జరిగిందని సమాచారం. రెమునరేషన్ విషయానికి వస్తే అలియా భట్ లాస్ట్ ఫిలిం జిగ్రా కు 10 నుండి 15 కోట్ల రూపాయలు తీసుకుంది. కానీ ఆల్ఫా కోసం ఏకంగా 25 కోట్ల రూపాయలు తీసుకుందని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే దీపిక రాకా చిత్రానికి తీసుకున్నంత రెమునరేషన్ అలియా ఆల్ఫా కు ఛార్జ్ చేసింది. కల్కి 2 నుండి దీపికను తొలగించడానికి హై రెమునరేషన్ డిమాండ్ ఒక కారణమని చెబుతున్నారు. ఇప్పుడు 25 కోట్లకు చేరిన అలియాను అంత పెట్టి నిర్మాతలు తీసుకొస్తారా లేక టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ కాబట్టి అలియా రెమునరేషన్ తగ్గిస్తుందా అనే విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com