ప్రశ్న రావణ్‌పై మరో కేసు: తొలగించిన డేటాపై ఫోరెన్సిక్ దర్యాప్తు
యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌పై పోలీసుల దర్యాప్తు మరింత ముమ్మరమైంది. ఇప్పటికే అతనికి చెందిన మూడు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసిన పోలీసులు, తాజాగా ఆయన ల్యాప్‌టాప్‌ను విశాఖపట్నం ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు.
ల్యాప్‌టాప్‌లో డిలీట్ చేసిన డేటాను రికవరీ చేస్తున్న ఫోరెన్సిక్ నిపుణులు, ఆర్థిక లావాదేవీల వివరాలు, కేసులకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. నేటి ఫోరెన్సిక్ నివేదికలో కొత్త ఆధారాలు లభిస్తే, జోసెఫ్‌పై మరిన్ని సెక్షన్లు అదనంగా నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
గతంలో, హిందూ దేవతలు, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, పాఠశాల గొడవను కుల వివక్షగా చిత్రీకరించడం, నిషేధిత మావోయిస్ట్ సంస్థకు మద్దతు తెలుపుతూ వీడియోలు ప్రచారం చేసినట్టు పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం, సర్పవరం పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులో బెయిల్‌పై విడుదలైన జోసెఫ్‌ను, అనంతరం ఉపా చట్టం కింద గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com