హైదరాబాద్ 26°C
అమరావతి 29°C
IST 7:43 PM
శుక్రవారం జూలై 31 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సినిమా

డ్యాన్స్ షూటింగ్‌లో రష్మికకు గాయం, ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచన

రచన: ఉషా కిరణం డెస్క్ ·
డ్యాన్స్ షూటింగ్‌లో రష్మికకు గాయం, ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచన
📷 Bollywood Hungama / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

నటి రష్మిక మందన్నా సినిమా షూటింగ్ లో డ్యాన్స్ చేస్తూ కింద పడిపోయి తుంటి భాగంలో గాయమైనట్టు సమాచారం. వైద్యులు ఆమెకు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది.

ప్రస్తుతం రష్మిక 'రణబలి', 'మైస' అనే రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలకోసం ఆమె డ్యాన్స్, యాక్షన్ సన్నివేశాలకు శిక్షణ తీసుకుంటున్నారు.

'రణబలి' షూటింగ్ సందర్భంగా డ్యాన్స్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com