హైదరాబాద్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా ప్రజా రవాణా వ్యవస్థ ఉండాలని ఆయన అన్నారు. ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
KBR Park చుట్టూ వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. recycled water వాడకంపై పూర్తి స్థాయి అధ్యయనం చేయాలని ఆదేశించారు. నగరంలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో PRT వ్యవస్థ ఏర్పాటు అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ప్రజలు ఎక్కువగా ప్రయాణించే ప్రాంతాల్లో మెట్రో, MMTS, బస్ స్టేషన్లతో అనుసంధానమయ్యేలా PRT రూపకల్పన చేయాలని సీఎం సూచించారు. ప్రపంచంలోని అత్యుత్తమ PRT వ్యవస్థలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com