సల్మాన్ ఖాన్ నీరసంగా కనిపించడంపై అభిమానుల ఆందోళన
ముంబైలోని స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ కార్యాలయం వద్ద ఇటీవల నటుడు సల్మాన్ ఖాన్ కనిపించారు. ఆయన క్యాప్ ధరించి, ముఖంలో కాంతి లేకుండా, చర్మంపై ముడతలతో చాలా నీరసంగా కనిపించారు. 60 ఏళ్ల వయసులో కూడా మొన్నటి వరకూ ఫిట్ గా కనిపించిన సల్మాన్ ఇలా మారిపోవడం అభిమానులను దిగ్భ్రమకు గురిచేసింది. ఇటీవలి ఫోటోల్లో కండరాలు కూడా బాగా తగ్గినట్టు కన్పించడంతో, ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లుక్ ఒక కొత్త సినిమా కోసం చేసిన మేకోవరా కావచ్చని కూడా చర్చ జరుగుతోంది. ఈ విషయంపై సల్మాన్ ఖాన్ టీం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ దిల్రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com