శేఖ్ హసీనా డిసెంబర్‌లో స్వదేశానికి: కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేఖ్ హసీనా డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం కొత్త పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని కోరుతూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు.
లండన్‌కు చెందిన మ్యాట్రిక్స్ ఛాంబర్స్‌లోని హసీనా తరపు న్యాయవాదులు ఢిల్లీలోని బంగ్లాదేశ్ తాత్కాలిక హైకమిషనర్ ప్రీతి రెహ్మాన్‌కు లేఖ అందజేశారు. కొత్త పత్రాలు జారీ చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని ఆ లేఖలో కోరారు.
బంగ్లాదేశ్ పౌరురాలిగా హసీనాకున్న హక్కులు, అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలను ఆ లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో చెలరేగిన తీవ్ర ఆందోళనల కారణంగా ఆమె 15 ఏళ్ల పాలన ముగిసింది. అనంతరం హసీనా భారత్‌కు వచ్చారు. రెండేళ్ల తర్వాత బంగ్లాదేశ్ అధికారులతో తొలిసారి అధికారిక సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి అక్కడ కోర్టులో లొంగిపోవాలని హసీనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత ప్రయాణ తేదీని ప్రకటిస్తామని ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com