రంగారెడ్డి జిల్లాలో ఎస్ఐ తన మనవరాలికి రద్దీ రోడ్డుపై కారు డ్రైవింగ్ నేర్పించిన వీడియో వైరల్
రంగారెడ్డి జిల్లాలో ఒక సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) తన ఆరేళ్ల మనవరాలికి రద్దీ ప్రధాన రహదారిపై కారు డ్రైవింగ్ నేర్పించారు.
దీంతో ఆ రోడ్డు మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికులు ఈ విషయాన్ని గమనించి, చిన్నారిని రోడ్డుపై డ్రైవింగ్ చేయించడం తగదని ఎస్ఐని ప్రశ్నించారు.
అప్పుడు ఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేసి, తనను ప్రశ్నించడానికి ఎవరూ లేరని బెదిరించినట్లు స్థానికులు ఆరోపించారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
వీడియోలో ఎస్ఐ వాహనం ముందు నంబర్ ప్లేట్ లేకపోవడం కూడా కనిపించింది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారి స్వయంగా నిబంధనలను ఉల్లంఘించడంపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై రంగారెడ్డి పోలీసు యంత్రాంగం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com