హైదరాబాద్ 28°C
అమరావతి 33°C
IST 11:55 AM
శనివారం జూలై 25 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వ్యాపారం

సింగరేణి కొత్త అడుగు: విలువైన ఖనిజాల అన్వేషణకు జియో ల్యాబ్ ప్రారంభం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
సింగరేణి కొత్త అడుగు: విలువైన ఖనిజాల అన్వేషణకు జియో ల్యాబ్ ప్రారంభం
📷 Ratnesh Tiwari / Pexels
షేర్ కాపీ అయింది ✓

విలువైన ఖనిజాల అన్వేషణకు సింగరేణి సిద్ధమైంది. ఈ లక్ష్యంతో కొత్తగూడెంలో జియో ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఖనిజాలను వెలికి తీసేందుకు Institute of Minerals and Materials Technology తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

నల్ల బంగారాన్ని వెలికి తీస్తూ రాష్ట్రానికి గుండెకాయలా నిలిచిన సింగరేణి ఇప్పుడు ఖనిజాన్వేషణ వైపు అడుగులు వేస్తోంది. సింగరేణి పలు ప్రాంతాల్లో భూలోహకాలు ఉన్నట్లు గుర్తించి వాటిని తవ్వి తీసేందుకు Institute of Minerals and Materials Technology తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఖనిజాన్వేషణ కోసం ప్రత్యేకంగా కొత్తగూడెంలో ఏర్పాటైన జియో ల్యాబ్ ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. 13 కోట్ల రూపాయల వ్యయంతో ఈ జియో ల్యాబ్ ను నిర్మించారు. భూమి లోపల పొరల్లో దాగి ఉన్న ఖనిజాలను కనుగొనేందుకు ఈ పరిశోధన శాల కీలకంగా పనిచేస్తుంది.

IMMMT తో జరిగిన ఒప్పందంలో కీలక ఖనిజాల అన్వేషణ, పరిశోధన, అధునాతన సాంకేతిక వినియోగం, ఉత్పత్తితో పాటు పర్యావరణ రహిత పద్ధతుల వినియోగంలో పరస్పర లాభదాయకమైన అంశాలు పొందుపరిచారు.

లాంతనం, సిరియం, ప్రసియోడమియం, ఇట్రియం, స్కాండియం, డిస్‌ప్రోజియం వంటి మొత్తం 14 రకాల Rare Earth Elements ఉన్నట్లు సింగరేణి గుర్తించింది. మణగూరుకు సమీపంలోని దుర్గంగుట్ట బ్లాక్‌లలో సగటున 266.21 PPM స్థాయిలో Rare Earth Elements ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

అరుదైన ఖనిజాలను వెలికి తీసే సాంకేతిక పరిజ్ఞానం మరియు అధునాతన యంత్రాలను సింగరేణి సంస్థ సమకూర్చుకుంటుంది. అరుదైన లోహాల ధరలు అధికంగా ఉన్నందున ఆదాయం ఎక్కువగా వస్తుందని యాజమాన్యం భావిస్తోంది.

దేశీయంగా IMMT తో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియాతో కూడా కీలక ఖనిజాల ఉత్పత్తికి సంబంధించి అవగాహన కుదుర్చుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకొని తదనుగుణంగా సింగరేణి అన్వేషణ పనులు చేపట్టింది. ఇది విజయవంతమైతే సంస్థకు భారీగా ఆదాయం సమకూరడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com