బ్రేకప్ తర్వాత అత్యాచారం కేసు సరికాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఇష్టపడి ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తులు సమ్మతించి శారీరకంగా దగ్గరవ్వడం నేరం కాదని సుప్రీంకోర్టు తేల్చింది. జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
కేరళకు చెందిన ఒక కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరూ దగ్గరగా ఉన్నారు. తర్వాత మనస్పర్థలు వచ్చి బ్రేకప్ అయింది. ఇప్పుడు వచ్చి మోసం చేశాడని, లైంగిక దాడి చేశాడని ఆరోపించడం సరికాదని కోర్టు పేర్కొంది. ఈ కేసులో నిందితుడు సంతోష్ కుమార్‌పై ఉన్న కేసును కోర్టు కొట్టేసింది.
అయితే మొదటి నుంచే ప్రణాళిక వేసి మోసం చేస్తే అది వేరు. అబద్ధపు మాటలతో బలవంతంగా లొంగదీసుకుంటే అది పూర్తిగా నేరమేనని కోర్టు స్పష్టం చేసింది. అలాంటి వారికి శిక్ష పడాల్సిందేనని పేర్కొంది.
బ్రేకప్ తర్వాత ఇలాంటి లైంగిక దాడి కేసులు వేస్తే, నిజంగా బాధపడిన బాధితుల కేసులకు విలువ పోతుందని కోర్టు హెచ్చరించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com