హైదరాబాద్ 28°C
అమరావతి 30°C
IST 8:51 AM
శుక్రవారం అక్టోబర్ 9 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లిగూడెం గృహిణి టెర్రస్ గార్డెన్‌తో ఆరేళ్లుగా కూరగాయలు, పూల మొక్కలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తాడేపల్లిగూడెం గృహిణి టెర్రస్ గార్డెన్‌తో ఆరేళ్లుగా కూరగాయలు, పూల మొక్కలు
📷 Sandeep Kashyap / Pexels
షేర్ కాపీ అయింది ✓

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన గృహిణి మాండమేరి ఆరేళ్లుగా ఇంటి మిద్దెపై కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు పండిస్తున్నారు. ఆమె ఇంటికి సరిపడా కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటున్నారు.

ఆమె టెర్రస్ గార్డెన్లో లిల్లీలు, మల్లెలు, ఐదు రకాల మందారాలు, కనకాంబరాలు, సన్నజాజులు వంటి పూల మొక్కలు ఉన్నాయి. లెమన్ గ్రాస్, ఇన్సులిన్ మొక్క కూడా పెంచుతున్నారు. వీటిని ఆరోగ్యం కోసం ఉపయోగిస్తున్నట్లు ఆమె చెప్పారు.

ఈ మొక్కలకు రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం లేదు. కిచెన్ వేస్ట్ తో కంపోస్ట్ తయారు చేస్తున్నారు. కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు మట్టిలో వేసి మజ్జిగ కలుపుతారు. తెల్ల ఫంగస్ రాకుండా ఇంగువ, కుంకుడు పులుసు కలిపిన ద్రావణాన్ని స్ప్రే చేస్తారు.

నీరు నిలవకుండా మొక్కలను స్టాండ్లపై ఉంచుతున్నారు. మిద్దెపై పంటలు పండించడం వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఇంటి మిద్దెలో చిన్నగా మొక్కలు పెంచాలని ఆమె సూచించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com