తెలంగాణ ముసాయిదా CURE బిల్లు 2026: ఆస్తి పన్ను మార్కెట్ విలువ ఆధారంగా లెక్కింపు
తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన CURE బిల్లు 2026 ముసాయిదాలో ఆస్తి పన్ను విధానంలో పెద్ద మార్పు ప్రతిపాదించారు. ఇప్పటి వరకు వార్షిక అద్దె విలువ ఆధారంగా పన్ను వసూలు చేస్తుండగా, కొత్త ప్రతిపాదనలో ఆస్తి మార్కెట్ విలువ, మూలధన విలువలను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఈ మార్పు వల్ల పాత జీహెచ్ఎంసీ పరిధిలోని అనేక ఇళ్లకు ఆస్తి పన్ను భారం బాగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ బిల్లులో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు, ఖాళీ స్థలాలలో చెత్త వేయడంపై భారీ జరిమానాలు, నైట్ ఎకానమీ జోన్ల ఏర్పాటు, ఫుడ్ సేఫ్టీ కమిటీ వంటి కీలక అంశాలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం ఈ బిల్లు ముసాయిదా మాత్రమే. ప్రభుత్వం జూలై 24 వరకు ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com