హైదరాబాద్ 28°C
అమరావతి 32°C
IST 12:18 PM
శనివారం జూలై 18 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

తెలంగాణలో 12 జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక; హైదరాబాద్‌లో చిరుజల్లులు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తెలంగాణలో 12 జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక; హైదరాబాద్‌లో చిరుజల్లులు
📷 Dibakar Roy / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణలోని 12 జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు: మంచిర్యాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, భద్రాద్రి, వరంగల్, ములుగు, హనుమకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, జనగామ, రాజన్న సిరిసిల్ల. హైదరాబాద్ నగరంలో ఇవాళ చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

ఈ ప్రాంతాల్లో గత నెలన్నరగా భారీ వర్షాలు లేవు. వర్షాభావ పరిస్థితులతో పత్తి విత్తనాలు వేసిన రైతుల పంటలు ఎండిపోయాయి. వరి నార్లు పోసుకోవడానికి కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువులు, వాగులు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటాయి.

వాతావరణ శాఖ సూచన మేరకు వర్షాలు కురిస్తే రైతులకు ఊరట లభిస్తుందని, వ్యవసాయ పనులు ముందుకు సాగే అవకాశం ఉందని అధికారులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొని ఉంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com