క్రికెట్

టిజి-20 లీగ్: ప్లే ఆఫ్ చేరిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఈరోజు కరీంనగర్ డైమండ్స్ తో తలపడనుంది

రచన: ఉషా కిరణం డెస్క్ ·
టిజి-20 లీగ్: ప్లే ఆఫ్ చేరిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఈరోజు కరీంనగర్ డైమండ్స్ తో తలపడనుంది
📷 Patrick Case / Pexels
షేర్ కాపీ అయింది ✓

టిజి-20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు ఇవాళ కరీంనగర్ డైమండ్స్‌తో తలపడనుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన హైదరాబాద్ ఇప్పటికే ప్లే ఆఫ్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. కరీంనగర్ జట్టు మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

హైదరాబాద్ జట్టు కెప్టెన్ అభిరత్ రెడ్డి మంచి ఫామ్‌లో ఉన్నాడు. బౌలర్ అజయ్ దేవగౌడ్ కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. గణేష్ గడుగు, ప్రణవ్ వర్మ, అన్విత్ రెడ్డి వంటి ఆటగాళ్లు అవసరమైనప్పుడు జట్టుకు అండగా నిలుస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమిష్టి ప్రదర్శనతో హైదరాబాద్ అజేయంగా కొనసాగుతుంది.

కరీంనగర్ డైమండ్స్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ కూడా రన్స్ చేస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. రాహుల్ రాధేష్, హెచ్.కె. సింహ, సాత్విక్ రెడ్డి వంటి ఆటగాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. హైదరాబాద్ జట్టు సమిష్టి బలాన్ని ఎదుర్కొనే సత్తా కరీంనగర్ జట్టుకు ఉందా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్ ఖాయమైనా, లీగ్ దశను అజేయంగా ముగించాలనే లక్ష్యంతో హైదరాబాద్ జట్టు బరిలోకి దిగుతుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:15 నిమిషాలకు ప్రారంభమవుతుంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com