హైదరాబాద్ 24°C
అమరావతి 26°C
IST 3:09 AM
శనివారం జూలై 18 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

The Odyssey క్రేజ్: సినిమా చూడడం కోసం గర్భధారణను వాయిదా వేసుకున్న మహిళ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
The Odyssey క్రేజ్: సినిమా చూడడం కోసం గర్భధారణను వాయిదా వేసుకున్న మహిళ
📷 Maahid Photos / Pexels
షేర్ కాపీ అయింది ✓

ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులందరూ గత కొన్ని రోజులుగా ఒకే ఒక్క సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన 'The Odyssey' సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. దాదాపు 2000 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా కోసం అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన 29 ఏళ్ల మహిళ అంబర్ కానగన్ తన గర్భధారణ ప్రణాళికను వాయిదా వేసుకున్నారు.

గత సంవత్సరం ఓ సందర్భంలో అంబర్ స్నేహితురాలు రెండో బిడ్డ గురించి ఆలోచించమని చెప్పింది. అయితే ఇప్పుడు గర్భధారణ ప్లాన్ చేసుకుంటే IMAX 70mm లో తొలిరోజు 'The Odyssey' చూడడం కుదరదని, అందుకే బిడ్డను కనే ప్లాన్ వాయిదా వేసుకుంటానని అంబర్ స్పష్టంగా చెప్పారు. మూవీ రిలీజ్ సందర్భంగా ఆమె హాలీవుడ్ ప్రముఖ వెబ్సైట్ కు ఈ విషయం చెప్పడంతో ఈ సంగతి బయటకు వచ్చింది.

'The Odyssey' సినిమాను గ్రీక్ పురాణాల్లోని ఒడిసియస్ అనే రాజు జీవితం ఆధారంగా తీశారు. అంబర్ మాత్రమే కాదు, ఈ సినిమా కోసం మరెందరో అభిమానులు విచిత్రమైన పనులు చేస్తున్నారు. IMAX థియేటర్ లోనే సినిమా చూడాలని అమెరికాలోని వేరే రాష్ట్రాలకు విమాన ప్రయాణాలు చేసి గంటల తరబడి వర్చువల్ క్యూలో నిలబడి మరీ సినిమా చూస్తున్నారు. ఈ మూవీని పూర్తిగా IMAX కెమెరాలతో చిత్రీకరించడమే దీనికి కారణం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 40 IMAX థియేటర్లు మాత్రమే ఉండడంతో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com