హైదరాబాద్‌లో టర్కీష్ స్వీట్ బక్లావాకు విపరీతమైన డిమాండ్
హైదరాబాద్‌లో టర్కీష్ స్వీట్ ‘బక్లావా’కు మంచి ఆదరణ లభిస్తోంది. భారత్‌లో 8–9 ఏళ్ల క్రితం బక్లావాను తొలిసారి అందించిన సంస్థ వ్యవస్థాపకుడు ఇంతియాజ్ అలీ సిద్దిఖీ ఈ విషయాన్ని తెలిపారు. మిడిల్ ఈస్ట్‌లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ స్వీట్‌ను ఇక్కడ కూడా జనం ఇష్టపడుతున్నారన్నారు.
బక్లావా కేజీ ధర రూ.3000 నుంచి 6000 వరకు ఉంటుంది. డ్రై ప్రూట్స్, పిండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వంటి మంచి పదార్థాలతో దీన్ని తయారు చేస్తారు. ఇది 3 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది.
ఈ స్వీట్‌ను చాలా మంది ఆరోగ్యకరమైన స్వీట్‌గా భావిస్తారని, ఇతర స్వీట్లతో పోలిస్తే దీనికి డిమాండ్ ఎక్కువగా ఉందని వ్యాపారి తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com