UPI లో తప్పుడు పేమెంట్ చేస్తే నిధులు తిరిగి పొందే విధానం
ఫోన్పే, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా పొరపాటున వేరే నంబర్‌కు డబ్బు పంపడం చాలా మందికి జరుగుతూ ఉంటుంది. చిన్న మొత్తం అయితే పోనీలే అనుకుంటారు. కానీ పెద్ద మొత్తం అయినప్పుడు ఆ డబ్బు తిరిగి పొందాల్సి ఉంటుంది.
తప్పుడు నంబర్‌కు డబ్బు పంపిన వెంటనే, పేమెంట్ రసీదు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఆ రసీదులో లావాదేవీ గుర్తింపు సంఖ్య (Transaction ID), యూటిఆర్ నెంబర్, పేమెంట్ తేదీ, రిసీవర్ యూపీఐ ఐడీ వంటి వివరాలు ఉండేలా చూసుకోవాలి. ఈ వివరాలు ఫిర్యాదు ప్రక్రియలో కీలకంగా ఉంటాయి.
సంబంధిత యాప్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి, ఆ వివరాలతో ఫిర్యాదు చేయాలి. పొరపాటు జరిగిందని నిర్ధారణ అయితే, కస్టమర్ కేర్ సంబంధిత బ్యాంకును డబ్బు రీఫండ్ చేయాలని సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో నేరుగా రీఫండ్ జరుగుతుంది.
ఒకవేళ యాప్ కస్టమర్ కేర్ నుంచి సరైన స్పందన రాకపోతే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడి యూపీఐ డిస్ప్యూట్ రిడ్రసల్ మెకానిజంలో ఫిర్యాదు ఫామ్ ను తప్పులు లేకుండా నింపి సబ్మిట్ చేయాలి. NPCI విచారణ చేసి, నిజంగా పొరపాటైతే బ్యాంకును రీఫండ్ చేయాలని ఆదేశిస్తుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com