అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాళ్లు: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి
పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్ మధ్య రెండు రోజులుగా పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులతో ఇప్పటికే సున్నితమైన ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి.
ఒమన్ సమీపంలో సింగపూర్ జెండాతో ప్రయాణిస్తున్న ఒక cargo నౌకపై డ్రోన్ దాడి జరిగిందని, ఆ దాడి చేసింది ఇరాన్ అని అమెరికా ఆరోపించింది. ఇది అంతర్జాతీయ నౌకాయాన మార్గాలకు తీవ్ర విఘాతం కలిగించిందని అమెరికా అధికారులు తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా, ఇరాన్ లోని క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత రాడార్ సైట్లపై అమెరికా వైమానిక దాడులు చేసింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ దాడులను తన Truth Social వేదికగా ధృవీకరించారు. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతోనే దాడులు చేశామని, ఈ విధంగా కొనసాగితే సైనిక పద్ధతిలో పని పూర్తి చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇరాన్ ఉనికే ప్రమాదంలో పడుతుందని కూడా ఆయన అన్నారు.
ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. కార్గో నౌకపై దాడి చేయలేదని, అమెరికాయే కాల్పుల విరమణ ఉల్లంఘించిందని ఐఆర్జిసి (IRGC) పేర్కొంది. దాడులు కొనసాగితే పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు నిలిచిపోతాయని, ఏ దురాక్రమణకైనా తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది.
ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల్లో శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలన్న అవగాహన ఉంది. హర్ముజ్ జలసంధిలో నౌకల సురక్షిత ప్రయాణం, ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలు, అణు కార్యక్రమంపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సంఘర్షణ పశ్చిమ ఆసియా రాజకీయ భద్రతా వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది, చమురు సరఫరా మార్గాలపై ప్రభావం పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ సంస్థలు ఇరు దేశాలను సంయమనం పాటించాలని కోరుతున్నాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com