హైదరాబాద్ 27°C
అమరావతి 29°C
IST 5:48 PM
సోమవారం ఆగస్టు 24 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సినిమా

వారణాసి సినిమాను 50 భాషల్లో డబ్బింగ్ చేసేందుకు ఏర్పాట్లు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వారణాసి సినిమాను 50 భాషల్లో డబ్బింగ్ చేసేందుకు ఏర్పాట్లు
📷 Bollywood Hungama / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

బాహుబలి, RRR చిత్రాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నటుడు మహేష్ బాబుతో 'వారణాసి' చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 50 భాషల్లో డబ్బింగ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది.

అందులో 50 దేశాల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రతి భాషకు AI వాయిస్ టెక్నాలజీ వాడకుండా ఒరిజినల్ డబ్బింగ్ ఆర్టిస్టులను ఎంపిక చేయాలని రాజమౌళి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు 1500 మందికి పైగా డబ్బింగ్ ఆర్టిస్టులకు ఆడిషన్లు నిర్వహించనున్నారు.

ఈ చిత్రంలో నటి ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీదుర్గ ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది. వారణాసి చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com