హైదరాబాద్ 27°C
అమరావతి 33°C
IST 6:00 PM
బుధవారం ఆగస్టు 5 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సినిమా

షూటింగ్ లో ప్రమాదం పై వరుణ్ తేజ్ వ్యాఖ్యలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
షూటింగ్ లో ప్రమాదం పై వరుణ్ తేజ్ వ్యాఖ్యలు
📷 Tima Miroshnichenko / Pexels
షేర్ కాపీ అయింది ✓

నటుడు వరుణ్ తేజ్ షూటింగ్ సమయంలో నటులు పడుతున్న గాయాలపై మాట్లాడారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు తప్పవని ఆయన అన్నారు.

'మిస్టర్' సినిమా షూటింగ్ చేసేటప్పుడు తన చీలమండ ఇరిగిందని, దాంతో రెండు నెలల పాటు మంచాన పడ్డానని గుర్తు చేశారు.

టెక్నాలజీ, బాడీ డబుల్స్, VFX వంటి సేఫ్టీ చర్యలు ఉన్నా కొన్ని రిస్కీ షాట్లను నటులే చేయాల్సి ఉంటుందని వివరించారు. నటుల గాయాలు వార్తల్లో వస్తాయి కాబట్టి ఎక్కువగా కనిపిస్తాయని, సామాన్య ప్రజలు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారని అన్నారు.

వరుణ్ తేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com