హైదరాబాద్ 26°C
అమరావతి 29°C
IST 3:28 AM
శుక్రవారం జూలై 10 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సినిమా

వీరభద్రుని రహస్యం సిరీస్ రివ్యూ: ఈ మిస్టరీ సిరీస్ చూడొచ్చా?

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వీరభద్రుని రహస్యం సిరీస్ రివ్యూ: ఈ మిస్టరీ సిరీస్ చూడొచ్చా?
📷 Maksim Romashkin / Pexels
షేర్ కాపీ అయింది ✓

90స్ కిడ్స్ కి మర్మదేశం సీరియల్ బాగా గుర్తుండే ఉంటుంది. వీరభద్రుని గుడి, ఆ ఊరి మిస్టరీ అప్పట్లో అందరినీ టీవీలకి కట్టిపడేసింది. ఇప్పుడు సరిగా అదే క్లాసిక్ స్టోరీని నేటి కాలపు టెక్నాలజీతో సరికొత్త విజువల్స్ తో కొత్తగా ఒక సిరీస్ గా మన ముందుకు తీసుకొచ్చారు. అదే వీరభద్రుని రహస్యం.

భక్తి, మిస్టరీ, సస్పెన్స్ కలగలిపిన ఈ సిరీస్ అసలు ఎలా ఉంది? మనం టైం స్పెండ్ చేసి చూడొచ్చా లేదా? పాత మర్మదేశం సీరియల్ నచ్చిన వాళ్ళకు ఈ కొత్త వీరభద్రుని రహస్యం ఒక మంచి నాస్టాల్జియా ఫీలింగ్ ఇస్తుందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ విషయానికి వస్తే, ఒక పురాతనమైన వీరభద్రస్వామి గుడి, ఆ ఊరి చుట్టూ జరిగే కొన్ని వింత సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ నడుస్తుంది. ఆ గుడిలో ఎవరికీ తెలియని ఒక రహస్యం దాగి ఉంటుంది. కొన్ని వందల ఏళ్ళుగా దాగున్న ఆ రహస్యాన్ని చేదించడానికి కొంతమంది ప్రయత్నిస్తే, దాన్ని కాపాడటానికి మరికొందరు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఊరిలో జరిగే మరణాలు ఏంటి, ఆ గుడి వెనక ఉన్న అసలు నిజం ఏంటి, మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఈ మిస్టరీని ఎలా చేదించారు అనేదే ఈ సిరీస్ మెయిన్ స్టోరీ.

ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, స్టోరీ లైన్ మరియు బ్యాక్ డ్రాప్ చాలా బాగున్నాయి. మన సంస్కృతిని, దైవత్వాన్ని, మిస్టరీని ఒకే చోట కలిపిన విధానం అద్భుతంగా ఉంది. కథలో వచ్చే ట్విస్ట్లు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతాయి. లీడ్ రోల్స్ చేసిన నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఎమోషనల్ మరియు సస్పెన్స్ సీన్స్ లో మెయిన్ రోల్స్ చేసిన వారందరూ అదరగొట్టేశారు. BGM లు కొన్ని సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాయి.

మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, మిడిల్ ఎపిసోడ్స్ లో కథ కొంచెం స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ సాగదీసిన భావన కలుగుతుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ప్రెడిక్టబుల్ సీన్స్ కూడా ఈ సిరీస్ కి ఒక పెద్ద మైనస్. త్రిల్లర్ జోనర్ ను రెగ్యులర్ గా చూసే ఆడియన్స్ కి కొన్ని ట్విస్ట్లు ఈజీగా అర్థమైపోతాయి. క్లైమాక్స్ బాగున్నా కూడా మరికొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

ఫైనల్ గా చెప్పాలంటే, వీరభద్రుని రహస్యం ఒక డీసెంట్ మిస్టరీ త్రిల్లర్. అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించినా కూడా, ఓవరాల్ గా కథలోని సస్పెన్స్ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. దైవిక రహస్యాలు, మైథలాజికల్ టచ్ ఉన్న త్రిల్లర్ కథలు నచ్చే వారికి ఈ సిరీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఈ సిరీస్ G5 లో అందుబాటులో ఉంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com