హైదరాబాద్‌లోని శ్రీ లలితా కామేశ్వరి క్షేత్రంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
హైదరాబాద్ కూకట్పల్లి శాంతినగర్‌లోని శ్రీ లలితా కామేశ్వరి దివ్య క్షేత్రంలో వారాహి, రాజశ్యామల, దశమహావిద్య దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగింది. కూర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠ ఉత్తరాధికారి శ్రీ దత్తేశ్వరానంద భారతి స్వామి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఐదు రోజుల పాటు ప్రత్యేక యాగాలు, హోమాలు, జలాదివాసాలు నిర్వహించారు. ప్రతిష్టా కల్పం ప్రకారం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో కుంకుమార్చన, పారాయణలు చేశారు. భక్తులందరూ క్రమశిక్షణతో పాల్గొని స్వచ్ఛంద సేవ అందించారు.
ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని దత్తేశ్వరానంద భారతి స్వామి స్వయంగా నిర్వహించి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. దేవాలయ మేనేజర్ ముడిపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com