హైదరాబాద్ 31°C
అమరావతి 32°C
IST 10:41 AM
గురువారం జూలై 16 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

20 ఏళ్ల IT ఉద్యోగం వదిలి చేపల వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న వినోద్ కుమార్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
20 ఏళ్ల IT ఉద్యోగం వదిలి చేపల వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న వినోద్ కుమార్
📷 Maahid Photos / Pexels
షేర్ కాపీ అయింది ✓

బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన వినోద్ కుమార్ 20 సంవత్సరాల IT ఉద్యోగాన్ని వదిలి ఆక్వా రైతులకు మేలు చేసే వ్యాపారం నిర్మించాలని నిర్ణయించుకున్నారు. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం ఉన్నా మనసు మాత్రం గ్రామీణ రైతుల వైపే ఉండేది. అదే స్ఫూర్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి డే క్యాచ్ పేరుతో అగ్రీ స్టార్టప్ ప్రారంభించారు.

ఈ స్టార్టప్ ప్రత్యేకత ఏమిటంటే దలారుల ప్రమేయం లేకుండా ఆక్వా రైతుల నుంచి నేరుగా చేపలు, రొయ్యలు కొనుగోలు చేయడం. రైతులకు గిట్టుబాటు ధర దొరుకుతూ వినియోగదారులకు తాజా, నాణ్యమైన సీఫుడ్ అందుతోంది. డే క్యాచ్ మొబైల్ యాప్ ద్వారా మొత్తం కొనుగోలు విక్రయ ప్రక్రియలు నిర్వహిస్తున్నారు.

చేపలు, రొయ్యలతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆధునిక సాంకేతికతతో ప్రాసెసింగ్ చేసి పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. డే క్యాచ్ ఫిష్ అండ్ చిప్స్ పేరుతో ప్రత్యేక అవుట్లెట్లు ఏర్పాటు చేశారు. దాదాపు 30 రకాల ఫిష్ స్నాక్స్ వినియోగదారులకు అందిస్తున్నారు. ఫిష్ లాలీపాప్స్, ఫిష్ పెల్లెట్స్, ప్రాన్ పాప్కార్న్, ప్రాన్ టార్పెడో, ప్రాన్ బటర్ఫ్లై వంటి వైవిధ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా వినూతన రుచులతో ఈ ఉత్పత్తులు రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో అవుట్లెట్లు విజయవంతంగా నడుస్తున్నాయి. భవిష్యత్తులో రెడీ టు ఈట్ కర్రీస్ కూడా మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రణాళికలు ఉన్నాయి.

స్వయం ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువత, మహిళలు, చిన్న వ్యాపారులకు ఫ్రాంచైజీ అవకాశాలు అందిస్తున్నారు. రెండు రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి FOFO మోడల్, అంటే ఫ్రాంచైజీ ఓన్డ్ ఫ్రాంచైజీ ఆపరేటెడ్. రెండవది FOCO మోడల్, అంటే ఫ్రాంచైజీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్. FOCO మోడల్లో సంస్థే సిబ్బందిని అందిస్తుంది, నిర్వహణ, మార్కెటింగ్ బాధ్యతలు సంస్థే చేపడుతుంది. లాభంలో 4% రాయల్టీ, 2% మార్కెటింగ్ ఖర్చులుగా తీసుకుంటారు. తక్కువ పెట్టుబడితో నెలకు 50,000 నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని వినోద్ కుమార్ తెలిపారు.

ఆక్వా రైతులు తమ పంటను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నారు. వనామీ రొయ్యలను ఇప్పటివరకు ఎగుమతి చేస్తుండగా ఇప్పుడు దేశీయ మార్కెట్లో కూడా అందుబాటులోకి తెస్తున్నారు. సాంకేతికతను వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు నిస్తూ డే క్యాచ్ స్టార్టప్ విజయ పథంలో దూసుకుపోతోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com