హైదరాబాద్ 25°C
అమరావతి 32°C
IST 9:27 AM
బుధవారం ఆగస్టు 5 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

వరంగల్‌లో తెలంగాణ రెండో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రి: మంత్రి దామోదర రాజనరసింహ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వరంగల్‌లో తెలంగాణ రెండో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రి: మంత్రి దామోదర రాజనరసింహ
📷 Click Jeth / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణలో రెండో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రిని వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎంఎన్జే (MNJ) క్యాన్సర్ ఆసుపత్రి తర్వాత ఇది రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద క్యాన్సర్ ఆస్పత్రి అవుతుంది.

ముమ్మడి వరంగల్‌తో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక క్యాన్సర్ వైద్యం అందుబాటులోకి తేవడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అందుకు అవసరమైన వరంగల్ రీజనల్ క్యాన్సర్ హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.

నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్య సేవలపై మంత్రి కొండా సురేఖతో కలిసి సమీక్ష నిర్వహించామన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com