హైదరాబాద్ 30°C
అమరావతి 33°C
IST 4:59 PM
గురువారం జూలై 16 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

మాదాపూర్‌లో యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల అనుమానం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
మాదాపూర్‌లో యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల అనుమానం
📷 Mikhail Nilov / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని వరంగల్ జిల్లా మాదనపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్‌గా పోలీసులు గుర్తించారు.

పోలీసుల విచారణలో ఈ హత్య వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్టు తెలుస్తోంది. భాస్కర్ అదే గ్రామానికి చెందిన నికిత అనే యువతిని ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే, ఆమె కుటుంబ సభ్యులు ఈ వివాహాన్ని అంగీకరించలేదు. మూడేళ్ల క్రితం నికితను వేరొకరికిచ్చి వివాహం చేశారు. కానీ, ఆమెకు భర్తతో సంసారం సాగలేదు. తర్వాత విడాకులు కూడా పొందింది.

నికిత తండ్రి రాజు, కుమార్తె విడాకులకు భాస్కరే కారణమని భావించి, అతడిపై కక్ష పెంచుకున్నాడు. భాస్కర్ ను చంపేందుకు పలుమార్లు బెదిరించినట్టు కూడా తెలుస్తోంది. కాగా, భాస్కర్ మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలోని ఓ హాస్టల్ లో నివసిస్తున్నాడు. శనివారం రాత్రి ఆయనను హాస్టల్ నుంచి బయటకు పిలిపించి, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు.

బాధితుల బంధువు చిన్నపల్లి మధు ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com